
ట్యాగ్ · 3 కథనాలు

నాని మీట్ క్యూట్ టీజర్ రిలీజ్
ఈమధ్య హీరోలు తమ రూట్ మార్చిన సంగతి తెలిసిందే. ఒకపక్క హీరోలుగా సినిమాలు చేస్తూనే మరోపక్క సొంత ప్రొడక్షన్ హౌస్ లు పెట్టేసుకుంటున్నారు. తమ సినిమాలను తామే నిర్మించుకుంటున్నారు. అంతేకాక వేరే హీరోలతో కూాడా సినిమాలను చేస్తున్నారు. అలాంటి హీరోల్లో నాని కూడా ఉన్నాడు. ఇప్పటికే హిట్2 సినిమాను నిర్మిస్తుండగా మరోవైపు మీట్ క్యూట్ అనే సినిమాను కూడా నిర్మిస్తున్నాడు. ఈసినిమా కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈసినిమా ఇప్పటివరకూ పెద్దగా అప్ డేట్స్ ఇచ్చింది లేదు చిత్రయూనిట్. అయితే తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్…

"మిస్టర్ ప్రేమికుడు"
తమిళ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో ప్రభుదేవా హీరోగా తెరకెక్కిన "కాదలన్ " తమిళ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. "కాదలన్ " తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ "ప్రేమికుడు "ఘనవిజయం సాధించింది. ఏ ఆర్ రెహమాన్ స్వరకల్పనలో సాంగ్స్ , ప్రభుదేవా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రభుదేవా ఇప్పుడు "మిస్టర్ ప్రేమికుడు" మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

జెట్ స్పీడ్ లో నాని మీట్ క్యూట్
హీరోగా ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క న్యాచురుల్ స్టార్ నాని నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. హీరోగానే కాదు.. నిర్మాతగానూ నానిది సక్సెస్‌ఫుల్ జర్నీనే. తొలుత `ఆ` అనే ప్రయోగాత్మక చిత్రం తీశాడు. ఆ తరవాత వచ్చిన `హిట్` కూడా… సూపర్ హిట్టయ్యింది. ఇక హిట్ 2 కూడా లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ఈసినిమా ప్రారంభమైంది కూడా. ఇక దీనితో పాటు నాని మరో సినిమాను నిర్మిస్తున్న సంగతి కూడా విదితమే. ఈసినిమాకు నాని సిస్టర్ దీప్తి ఘంటా దర్శకత్వం వహిస్తున్నారు.