
ట్యాగ్ · 2 కథనాలు


గోపీచంద్‌కి జోడీగా తమన్నా?

షూటింగ్స్ పునః ప్రారంభం పై తమన్నా అభిప్రాయం
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లో షూటింగ్స్ నిలిచిపోయి సినీ సెలబ్రిటీస్ ఇళ్ళకే పరిమితం అయిన విషయం తెలిసిందే. దాదాపు 3 నెలల తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని షరతులతో కూడిన షూటింగ్స్ అనుమతినిచ్చినా ఒకటి , రెండు చిన్న చిత్రాలు తప్ప పెద్ద సినిమాలు సెట్స్ కు వెళ్ళలేదు. స్టార్ , హీరో , హీరోయిన్స్ ఈ పరిస్థితులలో షూటింగ్స్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపడంలేదు. 4 నెలలకు పైగా ఇంటికే పరిమితం అయిన తమన్నా సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ , తన ఇంటి సభ్యులతో ఎంజాయ్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు.

గోపీచంద్‌కి జోడీగా తమన్నా?
గత ఏడాది విడుదలైన `పంతం`తో 25 చిత్రాల మైలురాయికి చేరుకున్నాడు కథానాయకుడు గోపీచంద్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో... తమిళ దర్శకుడు తిరు రూపొందిస్తున్న ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. కాగా... ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్‌ని రాజస్థాన్‌లో ప్లాన్ చేసింది యూనిట్. 45 రోజుల పాటు నిరవధికంగా జరిగే ఈ షెడ్యూల్‌లో కొన్ని పోరాట ఘట్టాలను చిత్రీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే... ఇద్దరు కథానాయికలకు స్థానమున్న ఈ చిత్రంలో ఒక నాయికగా బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ ఎంపికైందని ఆ మధ్య వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం... ప్రధాన నాయికగా మిల్కీ బ్యూటీ…