ట్యాగ్ · 2 కథనాలు
తాప్సీ ద్విపాత్రాభినయం
ఫాంటసీ డ్రామా మూవీ లో తాప్సీ
ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై దీపక్ సుందర్ రాజన్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో ఒక ఫాంటసీ డ్రామా తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ లో తాప్సీతో పాటు విజయ్ సేతుపతి కూడా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. రాజస్థాన్ జైపూర్ పరిసరాలలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ మూవీ కి "అన్నాబెల్లె సుబ్రమణ్యం" టైటిల్ పరిశీలనలో ఉంది.
తాప్సీ ద్విపాత్రాభినయం
"ఝుమ్మంది నాదం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ తాప్సీ తెలుగు , తమిళ భాషలలో పలు సూపర్ హిట్ చిత్రాలలో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ "ఛష్మే బద్దూర్ " మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయిన తాప్సీ సూపర్ హిట్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాప్సీ ప్రస్తుతం "హసీనా దిల్ రుబా ", "శభాష్ మిథు "(హిందీ ), "జనగణమన " తమిళ మూవీ లో నటిస్తున్నారు.