
ట్యాగ్ · 2 కథనాలు


'నాగరత్తమ్మ' తో ఎఫ్ 3 టీమ్ సందడి..!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ ఎఫ్3. 2019లో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ఎఫ్2 సినిమాకు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. నిజానికి 'ఎఫ్3' సినిమా కూడా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా మే27 న ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది.

విశాల్ "లాఠీ"మూవీ లో 300 ఫైటర్స్ తో భారీ యాక్షన్ సీన్
పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న యాక్షన్ చిత్ర హీరో విశాల్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో విశాల్ కు తమిళ అభిమానులతో పాటు తెలుగు అభిమానులు కూడా అధికమే. హీరో విశాల్ ప్రస్తుతం "వీరమే వాగై సూడుం "(సామాన్యుడు ), "తుప్పరివాలన్ 2(డిటెక్టివ్ 2), "విశాల్ 34 ", మార్క్ ఆంటోని " మూవీస్ లో నటిస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై పలు చిత్రాలను నిర్మిస్తున్న విశాల్ "తుప్పరివాలన్ 2(డిటెక్టివ్ 2) మూవీ తో దర్శకుడిగా మారారు.