ట్యాగ్ · 2 కథనాలు
ఆనందంలో పూజాహెగ్డే
పూజాహెగ్డే సూపర్ బిజీ
సక్సెస్ ఫుల్ "ఒక లైలా కోసం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజాహెగ్డే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. బ్లాక్ బస్టర్ "అల వైకుంఠపురం లో .. " మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న పూజాహెగ్డే ప్రస్తుతం "రాధేశ్యామ్ ", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ "మూవీస్ లో నటిస్తున్నారు. టాలీవుడ్ , బాలీవుడ్ లలో పలు అవకాశాలు అందుకుంటూ సూపర్ బిజీగా ఉన్న పూజాహెగ్డే సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
ఆనందంలో పూజాహెగ్డే
దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. "రాధేశ్యామ్ " మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీ లో జరుగుతుంది. ఇటలీ లో షూటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి పూజాహెగ్డే మాట్లాడుతూ .. చిన్న సెట్ లో తక్కువ టీమ్ మెంబర్స్ తో కరోనా వైరస్ జాగ్రత్తలతో షూటింగ్ జరుగుతుందనీ , కెమెరా ముందు మాస్క్ తీయాలి కాబట్టి తప్పకుండా కొంత రిస్క్ ఉంటుందనీ , లైఫ్ కొనసాగించాలంటే కొత్త జీవన శైలి కి అలవాటుపడాలనీ , తొలి రెండు రోజులు భయమనిపించినా ఇప్పుడు అంతా ఓకే ననీ చెప్పారు.