ట్యాగ్ · 42 కథనాలు · పేజీ 3
మళ్లీ బాక్సింగ్ మోడ్ లోకి వరుణ్..!
చిన్నప్పటి 'గద్దలకొండ గణేష్' - 'రియల్' టు 'రీల్'
మెగా కాంపౌండ్ లో ఉన్న హీరోల్లో మెగా ప్రిన్స్ రూటు కాస్త సెపరేట్. మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. 'ముకుంద' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన వరుణ్ మొదట కొన్ని పరాజయాలే అందుకున్నాడు. ఇక ఫిదా సినిమాతో క్లాస్ హిట్ కొట్టిన వరుణ్... తొలిప్రేమ,ఎఫ్2 తో కామెడీ యాంగిల్ ను చూపించాడు..గద్దల కొండ గణేష్ సినిమాతో మాస్ హిట్ కొట్టాడు.
మళ్లీ బాక్సింగ్ మోడ్ లోకి వరుణ్..!
ప్రస్తుతం వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఈ సినిమా కోసం ఒలింపిక్ విన్నర్ టోని జెఫ్రీస్ పర్యవేక్షణలో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు... హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.