ట్యాగ్ · 2 కథనాలు
'చిరు' సినిమాలో 'సోనూసూద్'..!
నిర్మాతగా సోనూ సూద్
తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో నెగటివ్ రోల్స్ లో నటిస్తూ సోనూ సూద్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ " అరుంధతి " మూవీ లో సోనూ సూద్ పశుపతి క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ విలన్ గా నంది , బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "అతడు ", "అశోక్ ", "దూకుడు ", జులాయి ", "సింబా "(హిందీ ) మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు.
'చిరు' సినిమాలో 'సోనూసూద్'..!
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించిన పేరు ఏదైనా ఉంది అంటే అది సోనూసూద్ పేరే. రీల్ లైఫ్ లో విలన్.. కానీ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అయిపోయాడు అందరికీ. కరోనా వల్ల ఎంతో మంది సమస్యలు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలిచాడు. ఎంతోమంది వలస కార్మికులను ప్రత్యేక బస్సులు, రైళ్లు, ఫ్లైట్లలో వారి స్వస్థలాలకు చేర్చారు. ఎంతో మంది పేదలకు సాయం చేసాడు. ప్రాణాలు కోల్పోయిన వలస కార్మికుల కుటుంబాలకు.. దాదాపు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తానని కూడా చెప్పాడు. ఇక ఇటీవల రైతు కుటుంబానికి ట్రాక్టర్ ఇవ్వడం, జాబ్ కోల్పోయిన మహిళకి ఉద్యోగం కల్పించడంతో అందరూ సోనూసూద్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతే కాదు…