
ట్యాగ్ · 3 కథనాలు

సంక్రాంతికి షిఫ్ట్ అయిన ఆచార్య..!
కొన్నిపెద్ద సినిమాల రిలీజ్ ల విషయంలో ఇప్పటికీ ఓ క్లారిటీ లేకుండా పోయింది. చిన్న సినిమాలు ఈ ఏడాది చివరి లోపు దాదాపు అన్నీ రిలీజ్ అయిపోతాయి. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటి నుండే పోటీ మొదలైంది. చాలా సినిమాలు ఇప్పటికే లైన్ లో ఉన్నాయి. ఇప్పుడు వాటికి తోడు మరో సినిమా కూడా పొంగల్ రేసులోకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఆసినిమా మరేదో కాదు కొరటాల దర్శకత్వంలో వస్తున్న చిరంజీవి సినిమా ఆచార్య. నిజానికి ఈసినిమా ఈనెలలో రిలీజ్ అవ్వాలి కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది.

"ఆచార్య "మూవీ అప్ డేట్
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో “ఆచార్య “మూవీ తెరకెక్కుతుంది . ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'ఆచార్య' రిలీజ్ కూడా వాయిదా
కరోనా సెకండ్ వేవ్ అంటూ కోరలు చాచింది. మళ్లీ గత ఏడాది పరిస్థితే వచ్చింది. లాక్ డౌన్ లు మొదలయ్యాయి. షూటింగ్ లు రద్దయ్యాయి. థియేటర్స్ మూత పడుతున్నాయి. రిలీజ్ లు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే చిన్న సినిమాలు చాలా వరకూ రిలీజ్ లను వాయిదా వేసుకున్నాయి. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ పెద్ద సినిమాలపై కూడా పడుతుంది. ఇక అనుకున్నదే జరిగింది.. ఈనేపథ్యంలోనే ఆచార్య కూడా వెనక్కి తగ్గాడు. మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య. ఈసినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. ఇక ఇప్పుడు ఈసినిమాను మే13న రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ ఇంకా షూటింగే పూర్తి కాలేదు.. మే 13న రావడం…