
ట్యాగ్ · 3 కథనాలు


సంక్రాంతికి షిఫ్ట్ అయిన ఆచార్య..!

'ఆచార్య' టాకీ పార్ట్ కంప్లీట్

'ఆచార్య' పూజా లుక్ రిలీజ్
ముకుందా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పూజాహెగ్డే కెరీర్ ఆరంభంలో కాస్త ఇబ్బందులే ఎదుర్కొంది. ప్రారంభంలో చేసిన సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో పలు కామెంట్స్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఆ తరువాత అపజయాలను కూడా పట్టించుకోకుండా కెరీర్ లో ఒక్కోమెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఇండియాలోనే బిజీ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సినిమా చేస్తూనే మరోపక్క హిందీ, తమిళ్ లో కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది.

సంక్రాంతికి షిఫ్ట్ అయిన ఆచార్య..!
కొన్నిపెద్ద సినిమాల రిలీజ్ ల విషయంలో ఇప్పటికీ ఓ క్లారిటీ లేకుండా పోయింది. చిన్న సినిమాలు ఈ ఏడాది చివరి లోపు దాదాపు అన్నీ రిలీజ్ అయిపోతాయి. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటి నుండే పోటీ మొదలైంది. చాలా సినిమాలు ఇప్పటికే లైన్ లో ఉన్నాయి. ఇప్పుడు వాటికి తోడు మరో సినిమా కూడా పొంగల్ రేసులోకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఆసినిమా మరేదో కాదు కొరటాల దర్శకత్వంలో వస్తున్న చిరంజీవి సినిమా ఆచార్య. నిజానికి ఈసినిమా ఈనెలలో రిలీజ్ అవ్వాలి కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది.

'ఆచార్య' టాకీ పార్ట్ కంప్లీట్
మెగాస్టార్చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాకు కరోనా వల్ల బ్రేక్ పడింది. అయితే ఇటీవలే ఈసినిమా తిరిగి మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేసింది. అన్నీ పరిస్థితులు బావుండే ఈనెల 13 న ఈసినిమా రిలీజ్ అయ్యేది కానీ కరోనా వల్ల అది కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.