
ట్యాగ్ · 2 కథనాలు


సుధీర్ బాబు-కృతి శెట్టి సినిమా ప్రారంభం

"ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" మూవీ అప్ డేట్
ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, సుధీర్ బాబు కాంబినేషన్ లో రూపొందిన " సమ్మోహనం" మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ తెరకెక్కుతుంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" మూవీ తెరకెక్కుతుంది. కృతిశెట్టి కథానాయిక కాగా అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణి నటరాజన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

సుధీర్ బాబు-కృతి శెట్టి సినిమా ప్రారంభం
‘సమ్మోహనం’, ‘వి’ సినిమాల తర్వాత హీరో సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఇటీవలే ఈసినిమా టైటిల్ ను ప్రకటించారు. ఇక ఇదిలా ఉండగా నేడు ఈసినిమా షూటింగ్ లో సుధీర్ బాబు కూడా జాయిన్ అవుతున్నట్టు తెలుపుతున్నాడు. ఈసందర్భంగా సుధీర్ బాబు తన ట్విట్టర్ లో ఈసినిమా షూటింగ్ లో పాల్గొంటున్నా.. మరోసారి ఇంద్రగంటి గారితో సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.