
ట్యాగ్ · 2 కథనాలు

సంక్రాంతి బరిలో సినిమాలు

కరోనా కారణంగా వాయిదా పడిన టాలీవుడ్ మూవీస్
కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి , రిలీజ్ లు ఆగిపోయి , థియేటర్స్ మూతబడి చిత్ర పరిశ్రమ పలు విధాలా నష్టపోయిన విషయం తెలిసిందే. 9నెలల తరువాత అంతా సక్రమం గా జరుగుతున్న తరుణం లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ తో తిరిగి చిత్ర పరిశ్రమకు కష్టాలు ప్రారంభం అయ్యాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి రూపొందించిన సినిమాలు కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడ్డాయి. చిన్న సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లలో రిలీజ్ అవుతున్నా పలువురు నిర్మాతలు తమ మూవీస్ ను థియేటర్స్ లలో రిలీజ్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు.
సంక్రాంతి బరిలో సినిమాలు
తెలుగు రాష్ట్రాలలో రిలీజయ్యే సినిమాలకు సంక్రాంతి పండగ పెద్ద సీజన్. సంక్రాంతి పండగకు రిలీజ్ అయిన సినిమాలు మంచి కలెక్షన్స్ రాబడతాయి. అందుకే నిర్మాతలు తమ మూవీస్ ను సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతారు. 2020 సంవత్సరం సంక్రాంతికి "సరిలేరు నీకెవ్వరు ", "అల .. వైకుంఠపురములో .. ", "ఎంత మంచివాడవురా ""దర్బార్ "డబ్బింగ్ మూవీ రిలీజ్ అయ్యాయి. "సరిలేరు నీకెవ్వరు ", "అల .. వైకుంఠపురములో .. " మూవీస్ ఘనవిజయం సాధించి రికార్డ్ కలక్షన్స్ రాబట్టాయి. 2021 సంవత్సరంలో కూడా 3స్ట్రెయిట్ , ఒక డబ్బింగ్ మూవీ సంక్రాంతి బరిలో ఉన్నాయి.