
సినిమా వార్తలు
ట్యాగ్ · 2 కథనాలు

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని , శ్రద్ధా శ్రీనాథ్ జంటగా క్రికెట్ నేపథ్యంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా "జెర్సీ " మూవీ ఘనవిజయం సాధించింది. హీరో నాని , హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నేషనల్ అవార్డ్స్ లో "జెర్సీ "మూవీ ఉత్తమ చిత్రం గా ఎంపిక అయ్యింది. ఈ సందర్భంగా స్పందించిన హీరో నాని ఒక వీడియో ను రిలీజ్ చేశారు.

కేంద్రం 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది. 2019లో విడుదలైన సినిమాలకు గానూ ఈ అవార్డులను ప్రకటించారు. ఇక ఈ అవార్డ్స్ లో భాగంగా మన తెలుగు సినిమాలు జెర్సీ, మహర్షి సినిమాలు కూడా అవార్డ్స్ ను సొంతం చేసుకున్నాయి.