
ట్యాగ్ · 2 కథనాలు


18 పేజెస్ బ్రేక్ లేకుండా షూట్

18 పేజెస్ టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ రిలీజ్
ఈ ఏడాది కార్తికేయ2 సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న నిఖిల్ ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా 18 పేజెస్. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను మళ్లీ చిన్నగా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇటీవల 'నన్నయ్య రాసిన' అనే పాటను విడుదల చేశారు. ఆ పాటకు మంచి రెస్పాన్సే వస్తుంది. ఇక ఇప్పుడు రెండో పాటను రిలీజ్ చేశారు. టైమ్ ఇవ్వు పిల్లా అనే రెండో పాటను నేడు రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈపాటకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈపాటను తమిళ్ స్టార్ హీరో…

18 పేజెస్ బ్రేక్ లేకుండా షూట్
పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా 18 పేజెస్. నిజానికి ఈసినిమా షూటింగ్ కార్తికేయ2 సినిమా కంటే ముందే మొదలైంది. అయితే ముందు కార్తికేయ 2 సినిమా కంప్లీట్ అవ్వడం.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం జరిగిపోయాయి. దీంతో ఇప్పుడు నిఖిల్ 18 పేజెస్ సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పెండింగ్ లో ఉన్న షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే నన్నయ్య రాసిన అనే పాటను రిలీజ్ చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో శింబు పాడిన టైం ఇవ్వు పిల్లా పాటను డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు.