కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

దిల్ రాజు నిర్మాణంలో రవితేజ నెక్స్ట్ మూవీ

Ravi Teja’s Next Movie Officially Announced

దిల్ రాజు నిర్మాణంలో రవితేజ నెక్స్ట్ మూవీ

Ravi Teja’s Next Movie Officially Announced

Ravi Teja’s Next Movie Officially Announced

ఇరుముడి’ సంచలన బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్న మాస్ మహారాజా రవితేజ, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు. దర్శకుడు హసిత్ గోలితో కలిసి రవితేజ ఓ హార్డ్‌కోర్ ఎంటర్‌టైనర్ చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రవితేజ, హసిత్ గోలి, ఎస్వీసీ కాంబినేషన్‌పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. తన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్లను రవితేజ మరో స్థాయికి తీసుకెళ్తే.. వైవిధ్యమైన కథలు, హ్యూమర్ తో హసిత్ గోలి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న సినిమా అంచనాలు పెంచింది.

తాజాగా సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. #SVC64 సంక్రాంతి కానుకగా 2027 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. దీంతో వచ్చే సంక్రాంతికి రవితేజ నుంచి ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను అలరించనుంది.

హసిత్ గోలి రూపొందించనున్న ఈ కామెడీ డ్రివెన్ కాన్సెప్ట్‌లో రవితేజ సరికొత్తగా కనిపించబోతున్నారు. హ్యూమర్, ఎనర్జీ, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం పుల్ లెంత్ ఎంటర్‌టైనింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది.

ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. సినిమా టైటిల్‌ను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్