ఇడుపు కాయితం ఫస్ట్ సింగిల్ ‘ఓ శ్రీలత’ ప్రోమో విడుదల.. హార్ట్‌టచింగ్ మెలోడీ

Idupu Kayitham Unveils Srilatha First Single Promo

టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా ఆయన లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఇడుపు కాయితం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఓ శ్రీలత’ ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. “ఓ శ్రీలత శ్రీలత శ్రీలత.. నువ్వు సిన్నబోకే నా శ్రీలత… ఈ శ్రీనివాసుడే నీ జత” అంటూ సాగే ఈ పాట కొత్తగా పెళ్లయిన శ్రీనివాస్, శ్రీలత జంట మధ్య ఉండే అనురాగాన్ని వివరిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి తెలంగాణ మట్టి వాసన పరిమళించేలా, వినగానే మనసుకి హత్తుకునేలా ఈ మెలోడీని స్వరపరిచారు.త్వరలోనే ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. తెలంగాణ ఫోక్ సాంగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.

సుకుమార్ రైటింగ్స్ మరియు బన్నీ వాస్ వర్క్స్ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు సుకుమార్, బన్నీ వాస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వంశీరెడ్డి దొండపాటి పక్కా తెలంగాణ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.