కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

65 కోట్లు దాటిన కూలీ ప్రీ సేల్స్

Coolie Pre-Sales Surpass ₹65 Crores

65 కోట్లు దాటిన కూలీ ప్రీ సేల్స్

Coolie Pre-Sales Surpass ₹65 Crores

Coolie Pre-Sales Surpass ₹65 Crores

మోస్ట్ అవైటెడ్ కూలీ మరో 2 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.రెండు వరుస ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడి నుండి వస్తున్న సినిమా కావడం అలాగే స్టార్ కాస్ట్ నటించడంతో కూలీ పై మొదటి నుండే భారీ అంచనాలు వున్నాయి.ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు.ప్రమోషనల్ కంటెంట్ కూడా జనాలకు బాగా రీచ్ అయ్యింది. దాంతో సినిమాపై హైప్ విపరీతంగా పెరిగిపోయింది.ఇక అందుకు ఈసినిమా తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో అదరగొడుతుంది. ఇప్పటివరకు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 65 కోట్ల ప్రీ సేల్స్ అయ్యాయి.ఇంకా తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ కాలేదు.టికెట్ హైక్ కోసం రెండు రాష్ట్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు.రేపు జీవో వచ్చే వచ్చే ఛాన్స్ వుంది. అటు ఓవర్సీస్ లోనూ ఈసినిమా అదరగొడుతుంది. ప్రీ సేల్స్ 30 కోట్లు దాటాయి.ఒక్క నార్త్ అమెరికా లోనే 2 మిలియన్ మార్క్ చేరుకుంది.ట్రెండ్ చూస్తుంటే కూలీ మొదటి రోజు 150 కోట్ల పైనే వసూళ్లను రాబట్టుకొనేలా వుంది.

లోకేష్ మార్క్ ఎంటరైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించగా కింగ్ నాగార్జున నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు. ఉపేంద్ర , షౌబిన్ షాహిర్, శృతి హాసన్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించగా సన్ పిక్చర్స్ నిర్మించింది.

అయితే కూలీకి తెలుగు ,హిందీలో భారీ పోటీ ఎదురుకానుంది.కూలీ వస్తున్న రోజే హృతిక్ రోషన్ - ఎన్టీఆర్ ల వార్ 2 కూడా రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ ఉండడంతో తెలుగులోనూ ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.దాంతో కూలీ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదుర్కోనుంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్