హీరో నాని ఫేవరెట్ హీరోయిన్

Natural Star Nani Reveals His Favourite Heroine

ఢీ , రాధాగోపాలం మూవీస్ కు దర్శకత్వ శాఖ లో పనిచేసిన నాని , మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ అష్టా చమ్మా మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. రైడ్, భీమిలి క‌బ‌డ్డి జ‌ట్టు వంటి మూవీస్ తో నాని ప్రేక్షకులను అలరించారు. అలా మొద‌లైంది, .పిల్ల జమీందార్ మూవీస్ విజయం సాధించడంతో నాని క్రేజీ హీరోగా మారారు. బ్లాక్ బస్టర్ ఈగ మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.నాని హీరోగా రూపొందిన భలే భలే మగాడివోయ్, కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ, ‘జెంటిల్ మ‌న్, మజ్ను , నేను లోకల్ ,నిన్నుకోరి , మిడిల్ క్లాస్ అబ్బాయి , జెర్సీ మూవీస్ విజయం సాధించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. నాని హీరోగా తెరకెక్కిన దసరా మూవీ 30 వ తేదీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న హీరో నాని ఒక ఇంటర్వ్యూ లో తన ఫేవరెట్ హీరోయిన్ గురించి వెల్లడించారు. నాని మాట్లాడుతూ .. తన ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి అనీ , ఆమె కు ఇప్పటికీ తాను వీరాభిమానిని అనీ , క్షణ క్షణం (1991 ) మూవీ లో శ్రీదేవి ని చూడటం తనకు ఇప్పటికీ కల గానే అనిపిస్తుందనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − fourteen =