టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటించిన ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటించారు. హీరో ప్రభాస్ నటించిన ఫస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ పాన్ వరల్డ్ మూవీ గా రిలీజ్ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ కు అద్భుత స్పందన లభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో సినిమా మళ్ళీ పోస్ట్‌పోన్ అయ్యిందంటూ వార్తలు మొదలయ్యాయి. దీంతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా దర్శకుడు ఓం రౌత్ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దీంతో దర్శక నిర్మాతలు స్పందించి ఆదిపురుష్ అప్డేట్ ఇచ్చారు. సినిమా సక్సెస్ కావాలని దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్.. జమ్మూ కాశ్మీర్ లోని వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించి ప్రార్ధించారు.అందుకు సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ.. సినిమా రిలీజ్ డేట్ లో ఎటువంటి మార్పు లేదని తెలియజేశారు.
*To a Mangalkaari Shurwaat!*
Seeking divine blessings at Vaishno Devi 🙏#Adipurush releases IN THEATRES on June 16, 2023 in 3D.#Adipurush #Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 #ShivChanana pic.twitter.com/V0d3j3boL1— T-Series (@TSeries) March 28, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: