వరుణ్ తేజ్ కు జోడీగా మిస్ యూనివర్స్

Miss Universe Manushi Chhillar To Act With Varun Tej,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,VT13,VT13 Movie,VT13 Telugu Movie,VT13 Movie Updates,VT13 Telugu Movie Latest News,VT13 Actress,VT13 Heroine,Varun Tej 13th Movie Heroine,Varun Tej 13th Movie Actress,Varun Tej Upcoming Film Actress,Manushi Chhillar,Manushi Chhillar Movies,Manushi Chhillar New Movie,Manushi Chhillar Telugu Movie,Manushi Chhillar In Varun Tej VT13,Manushi Chhillar In Varun Tej VT13 Movie,Manushi Chhillar In VT13 Movie,Manushi Chhillar In VT13,Manushi Chhillar To Make Telugu Debut With Varun Tej's VT13,Manushi Chhillar Comes On Board For Varun Tej's VT13,Varun Tej VT13,Varun Tej VT13 Movie,VT13 Latest Update

మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు వరుణ్ తేజ్. అందుకే వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు.ఇక ఈఏడాది గనితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్. అయితే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తరువాత ఎఫ్ 3 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో శక్తి ప్రతాప్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో నటించబోయే హీరోయిన్ గురించి నేడు అప్ డేట్ ను ఇస్తానన్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమాలో నటించే హీరోయిన్ గురించి అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ, మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ నటిస్తున్నట్టు అధికారింగా ప్రకటించారు. అంతేకాదు షూటింగ్ ను కూడా ప్రారంభించినట్టు తెలియచేశారు.

కాగా సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రినైసన్స్ పిక్చర్స్‌ పై సిద్దు ముద్దా, నందు ఈసినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈసినిమాను ఒకేసారి రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. గవెమిక్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నట్టు తెలిపారు. ఇక ఈసినిమాలో నటించే నటీ నటులు ఇతర వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.

ఇదిలా ఉండగా వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా వరుణ్ 12వ సినిమాగా వస్తుంది. ఈసినిమాకు గాండీవధారి అర్జున అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈసినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ చిత్రాన్ని నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు. ఈసినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. ముఖేష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 13 =