కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ లో లీడ్ రోల్ లో రావు రమేష్

Rao Ramesh To Play The Lead Role In Maruti Nagar Subramanyam Movie,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Rao Ramesh New Movie,Rao Ramesh Movies,Rao Ramesh Upcoming Movie,Rao Ramesh Late

మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ లో లీడ్ రోల్ లో రావు రమేష్

Rao Ramesh to play the lead role in Maruti Nagar Subramanyam Movie

Rao Ramesh To Play The Lead Role In Maruti Nagar Subramanyam Movie,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Rao Ramesh New Movie,Rao Ramesh Movies,Rao Ramesh Upcoming Movie,Rao Ramesh Late

సీమ సింహం (2002) మూవీతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన రావు రమేష్ కు సూపర్ హిట్ గమ్యం మూవీ తో బ్రేక్ వచ్చింది. తరువాత సూపర్ హిట్ కొత్త బంగారు లోకం మూవీలో లెక్చరర్ గా రావు రమేష్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రావు రమేష్ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. పలు తమిళ, కన్నడ మూవీస్ లో కూడా రావు రమేష్ నటించారు. రావు రమేష్ ప్రస్తుతం అన్నీ మంచి శకునములే, రావణాసుర, పుష్ప 2 మూవీస్ లో నటిస్తున్నారు. తాజాగా రావు రమేష్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీలో లీడ్ రోల్ కు ఎంపిక అయ్యారు.

పీబీఆర్ సినిమాస్ బ్యానర్ పై హ్యాపీ వెడ్డింగ్ మూవీ ఫేమ్ లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రావు రమేష్ కథానాయకుడిగా ఫన్ &ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ తెరకెక్కనుంది. ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీలో సీనియర్ హీరోయిన్ ఇంద్రజ ఒక కీలక పాత్రలో నటించనున్నారు. రావు రమేష్ క్యారెక్టర్ గురించి దర్శకుడు లక్ష్మణ్ కార్య మాట్లాడుతూ .. నడి వయసులో ఉన్న ఒక మధ్య తరగతి నిరుద్యోగిగా రావు రమేష్ కనిపిస్తారనీ , ఆయన జీవితంలో క్షణ క్షణం జరిగే ట్విస్టులే చిత్ర కథాంశంఅనీ , రెండు గంటల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే చిత్రమిదనీ, ఫన్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు ననీ , రావు రమేష్ గారు లీడ్ రోల్ చేయడానికి అంగీకరించడం మా ఫస్ట్ సక్సెస్ అనీ.. కథ నచ్చి ఆయన ఓకే చేశారనీ.. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. మార్చి నుంచి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా రెగ్యులర్ షూటింగ్ సార్ట్ చేస్తామని నిర్మాణ సంస్థ పీబీఆర్ సినిమాస్ తెలిపింది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్