హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచ వ్యాప్తంగా250 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీఅన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.ఈ మూవీ పై ప్రేక్షకులతోపాటు ,సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాంతార మూవీని ప్రత్యేకంగా చూసిన సూపర్ స్టార్ రజినీకాంత్, కాంతార టీమ్ కి పేరు పేరునా అభినందనలు తెలియచేసారు. ఇప్పుడు కాంతార హీరో రిషబ్ శెట్టిని ప్రత్యేకంగా ఇంటికి పిలిపించి శాలువాతో సత్కరించిన రజనీకాంత్ , అతడిని మూవీ విషయమై ఎంతో గొప్పగా అభినందించారు. ముఖ్యంగా కాంతార సినిమాలో ప్రతి ఒక్క పాత్ర సహజత్వానికి ఎంతో దగ్గరగా ఉందనీ , రిషబ్ శెట్టి యాక్టింగ్ తో పాటు సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాలు ఎంతో బాగా నచ్చాయనీ రజినీకాంత్ చెప్పారని సమాచారం.హీరో , దర్శకుడు రిషబ్ ని రజనీకాంత్ ఇంటికి పిలిపించి మరీ అభినందించడంతో కాంతార మూవీకి మరింతగా హైప్ దక్కిందని విశ్లేషకులు అంటున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: