లక్కీ హ్యాండ్ గా పాన్ ఇండియా స్టార్

pan india star prabhas is considering as lucky hand, prabhas is considering as lucky hand, pan india star prabhas, Zombie Reddy, Sita Ramam, Jathi Ratnalu, prabhas Latest Movie, Adipurush, Adipurush Update, Adipurush Telugu movie, Adipurush New Update, Adipurush Telugu Movie New Update, Adipurush Movie, Adipurush Latest Update, Adipurush Movie Updates, Adipurush Telugu Movie Live Updates, Adipurush Telugu Movie Latest News, Adipurush Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్స్ అంటూ కొంతమందిని అంటూ ఉంటారు. అంటే వాళ్లు ఏ సినిమా చేసినా అది హిట్ అవుతుందని అలా పిలుస్తుంటారు. ఇక ఇప్పుడు తాజాగా లక్కీ హ్యాండ్ అని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు తెచ్చుకుంటున్నారు. అయితే ఆపేరు వస్తుంది తన సినిమాలకు కాదు.. తను ప్రమోట్ చేస్తున్న సినిమాలకు. ఈమధ్య కాలంలో చిన్న సినిమాల దగ్గర నుండి కొన్ని పెద్ద సినిమాల వరకూ ప్రభాస్ ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అలా తను సపోర్ట్ చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముందుగా కె.జి.యఫ్ సినిమా నుండి మొదలుపెడితే ఈసినిమాకు ప్రభాస్ చాలా సపోర్ట్ చేశారు. ప్రభాస్ కోసం ఈసినిమా స్పెషల్ స్క్రీనింగ్ ను కూడా నిర్వహించారు. మరి కె.జి.యఫ్ 1 అండ్ పార్ట్ 2 సినిమాలు ఎంత విజయం సాధించాయో తెలుసు. అంతేకాదు ప్రభాస్ జాంబిరెడ్డి, జాతిరత్నాలు, సీతారామం సినిమాలకు కూడా తన సపోర్ట్ అందించాడు. సోషల్ మీడియాల వేదికగా కూడా పోస్ట్ లు చేసి ప్రమోట్ చేశాడు. ఇక మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ లు అందుకున్నాయి. ఇక రీసెంట్ గా వచ్చిన కాంతార సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కె.జి.యఫ్ మేకర్స్ నిర్మించిన ఈసినిమా కన్నడలో సూపర్ హిట్ అయింది. ఈసినిమా తెలుగులో రిలీజ్ కాకముందే ప్రభాస్ తన ఇన్ట్సాలో మంచి రివ్యూ ఇచ్చారు. ఆ తరువాత గీతా ఆర్ట్స్ వారు ఈసినిమా హక్కులను సొంతం చేసుకొని తెలుగులో రిలీజ్ చేశారు. తెలుగులో కూడా ఈసినిమా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. దీంతో ప్రభాస్ లక్కీ హ్యాండ్ అనే పేరు సొంతం చేసుకున్నాడు. మరి ఇది గమనించి ముందు ముందు ప్రభాస్ తో సినిమాలను ప్రమోట్ చేయడానికి మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారేమో చూడాలి.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆది పురుష్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. వీటితో పాటు ఇంకా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా కూడా చేస్తున్నాడు. ఈసినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఇంకా మారుతి దర్శకత్వంలో, సందీప్ వంగా దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 5 =