హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి. 115 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకు పోతూ కర్ణాటక బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రంగా నిలిచింది. యాక్షన్… థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఐఎండీబీ రేటింగ్ 9.6 సాధించి రికార్డు క్రియేట్ చేసింది. కాంతార మూవీ తెలుగు వెర్షన్ గీతా ఆర్ట్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా అక్టోబర్ 15 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాంతార మూవీ తెలుగులోనూ ప్రభంజనం సృష్టించడంతో బుధవారం (అక్టోబర్ 19) హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఈ మూవీ హీరో, డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుండటం చాలా ఆనందంగా ఉందనీ , ఈ సినిమా తనకు మంచి ఎనర్జీ ఇచ్చిందనీ , మంచి కంటెంట్ ఉంటే సినిమాలకు భాష అడ్డు కాదని తెలుగు ప్రేక్షకులు నిరూపించారనీ , కన్నడ వెర్షన్ తోపాటు తెలుగు వెర్షన్ కూడా భారీ కలెక్షన్ తో ప్రదశించడం ఆనందంగా ఉందనీ , ఇంతటి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలనీ చెప్పారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. సినిమాకు భాష అడ్డు కాదనీ , కేవలం ఎమోషన్ మాత్రమే కనెక్ట్ అవుతుందనీ , విష్ణు తత్వం ఉన్న ఈ సినిమా కథ మన సింహాచలానికి కూడా ఇది కనెక్ట్ అవుతుందని అనుకున్నాననీ , ఈ సినిమాలో హీరో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారనీ , కన్నడ వెర్షన్ ను చుసిన తాను ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని భావించాననీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: