ఐశ్వర్యను చూస్తే అసూయగా ఉంది

Meena about Aishwarya Rai, Actress Meena about Aishwarya Rai, Meena About Aishwarya Rai Character In PS1, Actress Meena Intresting Comments On Aishwarya Rai, Ponniyin Selvan Movie Latest Collections, Ponniyin Selvan Telugu Movie Latest Collections, Ponniyin Selvan Collections, PS1 Collections, Actress Meena, Vikram,Mani Ratnam,AR Rahman,Aishwarya Rai Bachchan,Jayam Ravi,Karthi,Trisha, Prabhu, R Sarathkumar, Aishwarya Lekshmi, Sobhita Dhulipala, Ponniyin Selvan 1, Ponniyin Selvan 1 Telugu Movie, PS 1, PS 1 Telugu movie, PS 1 New Update, PS 1 Telugu Movie New Update, PS 1 Movie, PS 1 Latest Update, PS 1 Movie Updates, PS 1 Telugu Movie Live Updates, PS 1 Telugu Movie Latest News, PS 1 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాను తెరకెక్కించాడు. రెండు పార్ట్ లుగా వస్తున్న ఈసినిమాలో మొదటి పార్ట్ ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈసినిమా మంచి ప్రేక్షకాదరణే పొందింది. ఇక కలెక్షన్స్ పరంగా ఈసినిమా కూడా సాలిడ్ కలెక్షన్సే రాబట్టుకుంటుంది. ముఖ్యంగా తమిళ్ లో మాత్రం ఈసినిమా మంచి రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే తమిళ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా కొత్త రికార్డులు సృష్టిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో ఐశ్వర్యరాయ్ ను చూసి అసూయగా ఉందంటున్నారు ఓ సీనియర్ హీరోయిన్. ఆ హీరోయిన్ ఎవరో కాదు మీనా. తాజాగా మీనా పొన్నియన్ సెల్వన్ సినిమా చూశారు. ఈసందర్భంగా తన సోషల్ మీడియా ద్వారా ఈసినిమాపై స్పందించిన మీనా..ఈ సినిమాలో నటించిన వారందరికీ ఆమె అభినందనలు తెలిపారు. ఇంకా ఈవిషయాన్ని ఎక్కువ కాలం దాచుకోలేను.. నాకు ఊపిరి సలపనీయడం లేదు.. బయటపెట్టాల్సిందే.. నాకు అసూయగా ఉంది. నా జీవితంలో మొదటిసారి ఐశ్వర్యారాయ్ ను చూసి అసూయ పడుతున్నాను. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో ఐశ్వర్య రాయ్‌ నటించిన నందిని పాత్ర నాకు ఎప్పటి నుంచో డ్రీమ్‌ రోల్.. కానీ, ఆ పాత్రలో ఐశ్వర్య రాయ్‌ అత్యద్భుతంగా నటించింది. నా జీవితంలో మొదటిసారి ఐశ్వర్య రాయ్ ను చూసి అసూయపడుతున్నాను అంటూ తెలిపింది.

కాగా నటి మీనా భర్త ఈఏడాది మృతి చెందిన సంగతి తెలిసిందే. భర్త విద్యా సాగర్ ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూ, పరిస్థితి విషమించడంతో ఈ ఏడాది జూన్ 28న చెన్నైలో మరణించడం తెలిసిందే. ఇక ఇప్పుడిప్పుడే ఆ విషాద ఘటన నుంచి కోలుకుంటున్నారు. మళ్లీ నటించేందుకు రెడీ అవుతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =