హరిహర వీరమల్లు వర్క్ షాప్-వైరల్ గా పవన్ ట్రెండీ లుక్

Pawan Kalyan trendy look goes viral, Pawan Kalyan's trendy look, Actor Pawan Kalyan, Pawan Kalyan's Hari Hara Veera Mallu, Pawan Kalyan Latest Movie, Pawan Kalyan's Upcoming Movie, Krish Jagarlamudi, Nidhhi Agerwal, Hari Hara Veera Mallu, Hari Hara Veera Mallu Telugu movie, Hari Hara Veera Mallu New Update, Hari Hara Veera Mallu Telugu Movie New Update, Hari Hara Veera Mallu Movie, Hari Hara Veera Mallu Latest Update, Hari Hara Veera Mallu Movie Updates, Hari Hara Veera Mallu Telugu Movie Live Updates, Hari Hara Veera Mallu Telugu Movie Latest News, Hari Hara Veera Mallu Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

రీఎంట్రీ తరువాత పవన్ కళ్యాణ్ పలు సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను కూడా అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది ఆయన నుండి రాబోతున్న హరిహర వీరమల్లు సినిమా గురించి. అయితే ఈసినిమా ఆలస్యమవుతూ వస్తూనే ఉంది. వకీల్ సాబ్ కంటే ముందే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. కొంతవరకూ షూటింగ్ కూడా పూర్తిచేశారు. అయితే చాలా కాలంగా ఈసినిమా షూటింగ్ మళ్లీ మొదలుపెడతారు అని అనుకున్నారు. మధ్యలో షూటింగ్ రీస్టార్ట్ చేసి ఒక షెడ్యూల్ కూడా పూర్తిచేశారు. మధ్యలో మళ్లీ బ్రేక్ పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇన్ని రోజులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుండి ఫైనల్ గా అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా పెండింగ్ షూటింగ్ కు సంబంధించి ప్రీ షెడ్యూల్ వర్క్‌షాప్‌ను మొదలుపెట్టినట్టు తెలిపారు. ఈసినిమా షూటింగ్ అక్టోబర్ నెల మిడ్ వీక్ నుండి మొదలవుతుందని డైరెక్టర్ క్రిష్ కూడా తెలిపాడు. ఈ వర్క్ షాప్ లో పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఇతర నటీనటులు, మూవీ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉంది అయితే వర్క్ షాప్ లో పవన్ నుంచి కొన్ని క్రేజీ స్టిల్స్ అయితే బయటకి వచ్చాయి. ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి. అందులో పవన్ మంచి స్టైలిష్ గా కనిపించడమే కాకుండా వింటేజ్ కళ్యాణ్ ని కూడా గుర్తు చేసాడు. దీంతో పవన్ లుక్ కు అందరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

కాగా ఈసినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నుండి అర్జున్‌ రాంపాల్‌ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత ద‌ర్శకుడు యం.యం.కీర‌వాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + nine =