
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన సీతా రామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విశేష ప్రేక్షకాదరణతో సీతా రామం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఈ మూవీ కి బాలీవుడ్ లో కూడా అద్భుత స్పందన లభించింది.
సెప్టెంబర్ 9 వ తేదీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో తెలుగు , తమిళ , మలయాళ భాషలలో రిలీజ్ అయిన సీతా రామం మూవీ కి అద్భుత రెస్పాన్స్ వస్తున్నట్టు సమాచారం.థియేటర్స్ కు సరైన కంటెంట్ ఉన్న సినిమా వస్తే ఎంత పెద్ద హిట్ అవుతుందో ఈ సినిమా నిరూపించింది. సీతా రామం మూవీ ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల గ్రాస్ , 40 కోట్ల షేర్ సాధించి దుల్కర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.తాజాగా సీతా రామం మూవీ 50 రోజులు పూర్తి చేసుకుంది.







