‘ఎఫ్3’.. ఫ్యామిలీ ఆడియన్స్ తో హౌస్ ఫుల్..!

F3 Movie Gets Superb Response on Sunday,F3 Gets Stronger On Day 3, Sunday With Family Audiences,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3,F3 Movie,F3 Telugu Movie,F3 Movie Latest Updates,F3 Collection Updates,F3 Movie Gets Stronger on Day 3,F3 Movie Day 3 Updates,F3 Movie Sunday Updates,F3 Movie on Sunday Family Audiences, Venkatesh and Varun Tej F3 Movie Day 3 Updates,Venkatesh F3 Movie Updates,F3 Movie gets Family Audiences,F3 Movie Stronger on Day 3 with Family Audiences,F3 Movie latest News,Anil Ravipudi F3 Movie Day 3 Latest Updates,F3 Movie Sunday Response

ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల హవా ఎక్కువైంది. ఇంకా యాక్షన్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు ఇలా పలు జోనర్లు ఎక్కువయ్యాయి. దీంతో థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తక్కువయ్యారు. ఫ్యాన్స్, సినీ లవర్స్ అయితే ఎలా ఉన్నా సినిమాలు చూసేస్తారు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కు ఒక సినిమా కనెక్ట్ అవ్వాలంటే చాలా కష్టం. వారికి నీట్ అండ్ క్లీన్ ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వాలి. ఈమధ్య అలాంటి సినిమాలు రావడం చాలా తక్కవైపోయాయి. కానీ చాలా కాలం తరువాత ఒక సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం ధియేటర్లకు రప్పిస్తుంది. ఆ సినిమా మరేదో కాదు ఎఫ్ 3.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఎఫ్3. ఎప్ 2 సినిమాకు సీక్వెల్ గా ఈసినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరెక్కిన ఈసినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఫస్ట్ షో నుండి సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకొని ఈసినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉండగా ఈసినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతున్నారు. అనిల్ రావిపూడి సినిమాలు అంటే కామెడీ ఎలా ఉంటుందో తెలిసిందే కదా. అంతే కాకుండా పెద్దగా హడావుడి లేకుండా నటీ నటులతో చేయించిన కామెడీకి అందరూ కనెక్ట్ అవుతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకూ అందరూ థియేటర్లకు వెళ్లి మరీ సినిమాను చూస్తున్నారు. దీంతో రిలిజ్ అయి మూడు రోజులు అవుతున్నా కూడా ఇంకా హౌస్ ఫుల్ అవుతుండటం విశేషం.

ఇక కలెక్షన్ల విషయంలో కూడా ఈసినిమా ఎక్కడా రాజీ పడుతున్నట్టు కనపించడంలేదు. మూడు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 63 కోట్లకు పైగా గ్రాస్ ను రాబట్టింది. కేవలం ఇక్కడ మాత్రమే కాదు యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా బాగానే రాబడుతున్నట్టు తెలుస్తుంది. 1మిలియన్ డాలర్లకు చేరువగా ఈసినిమా కలెక్షన్స్ వస్తున్నట్టు సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − five =