స్పెషల్ డే ‘SSMB 28’ అప్ డేట్.. ఎక్స్ పెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్..!

Super Fans Expect an update on Superstar Mahesh Babu Birthday,Mahesh Babu Fans Expect SSMB28 Update On This Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Movie Updates,Mahesh Babu upcoming Movies,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Block Buster Movies,Mahesh Babu Super Hit Movie Sarkaru Vaari paata, Mahesh Babu Fans,Super Star Mahesh Babu Fans,Mahesh Babu Fans About SSMB28,SSMB28 Movie Updates,Mahesh Babu SSMB28 Movie Latest Updates,Mahesh Babu Fans Expect to Release SSMB28 Movie on SUper Star Krishna Birthday, Super Star Krishna Birthday on 31st May,Mahesh Babu Father Super Star Krishna Birthday on May 31st,Mahesh Babu Fans Wants SSMB28 to Release on Kirshna Birthday

సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి ఎప్పుడు సినిమా వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు సర్కారు వారి పాటతో ఫుల్ ట్రీట్ ఇచ్చాడు మహేష్ బాబు. ఇక ఇప్పుడు ఫ్యాన్స్ ఫోకస్ తన నెక్స్ట్ సినిమాపై పడింది. మహేష్ తన తరువాత సినిమా త్రివిక్రమ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయితే మహేష్ యూరప్ ట్రిప్ లో ఉన్నాడు. తిరిగి వచ్చిన తరువాత త్వరలోనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. అయితే ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ వస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మే 31వ రోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఈ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ 28వ సినిమాకు సంబంధించిన అప్ డేట్ వస్తుందేమో అని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అయితే ఎక్స్ పెక్ట్ చేయడానికి రీజన్ కూడా ఉంది. ఇదే రోజు మహేష్ గత సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా వచ్చాయి. సరిలేరు నీకెవ్వరు, రీసెంట్ గా వచ్చిన సర్కారు వారి పాట సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కృష్ణ బర్త్ డేకే ఇచ్చారు. సరిలేరు నీకెవ్వరు సినిమా టైటిల్ అలానే సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ ను ఈ స్పెషల్ డేనే రిలీజ్ చేశారు. ఇక ఈరెండు సినిమాలు కూడా బక్సాఫీస్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాయి. దీంతోనే అదే సెంటిమెంట్ తో ఈ ఏడాది కూడా మే31న మహేష్ 28వ సినిమాకు సంబంధించి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధా కృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేయనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =