“ఆచార్య ” రామ్ చరణ్ , పూజాహెగ్డే ల ఇంటర్వ్యూ

Acharya Movie Ram Charan And Pooja Hegde Interview,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Charan & Pooja Hegde Exclusive Interview,Acharya Movie Interview,Chiranjeevi,Koratala Siva,Ram Charan,Pooja Hegde,Telugu FilmNagar,Acharya Pre Release Event,Acharya,Mani Sharma,Acharya Movie Songs,Acharya Trailer,Acharya Telugu Movie,Kajal Aggarwal,Ram Charan about chiranjeevi,Acharya Interview,acharya interview latest,2022 Telugu Movies,Latest Telugu Movies 2022,Telugu New Movies 2022,Pooja Hegde Acharya Interview,Ram Charan Acharya Interview

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజా హెగ్డే జంటగా నటించారు. సోనూసూద్ ఒక కీలక పాత్రలో నటించారు. “ఆచార్య ” మూవీ లో హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. “ఆచార్య” మూవీ లో టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆచార్య” మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ భారీ ఎత్తున చేపట్టిన విషయం తెలిసిందే.ప్రమోషన్స్ లో భాగంగా సిద్ధ, నీలాంబరి పాత్రలలో నటించిన రామ్ చరణ్ , పూజాహెగ్డే ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. రామ్ చరణ్ మాట్లాడుతూ .. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రస్తుతం బెస్ట్ పేజ్ లో ఉందనీ, అందుకు సంతోషంగా ఉందనీ , “ఆచార్య “మూవీ లో ఫస్ట్ అనుకొన్న సిద్ధ పాత్ర 15 నిమిషాల నిడివి అనీ , తరువాత 40 నిమిషాల క్యారెక్టర్ అయిందనీ , “ఆర్ ఆర్ ఆర్ “మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాననీ ,సిద్ధ క్యారెక్టర్ తనకు రావడం ఆనందంగా ఉందనీ , ఎవరు నటించినా హిట్ అయ్యే కథ అనీ , నాన్న (చిరంజీవి ), తాను గెస్ట్ పాత్రలలో నటించినా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కై 13 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాననీ ,మేమిద్దరం కలసి నటిచాలని మా మదర్ కోరికని , దర్శకుడు రాజమౌళి తనకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అనీ , నాన్న తో నటించడం టెన్షన్ గా ఉండేదనీ , నాన్న గారి , తన పాత్రలు డిఫరెంట్ గా ఉంటాయనీ , అంతిమంగా ధర్మం కోసమే నిలబడతాయనీ,ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న 20 రోజుల్లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాననీ , సహ నటుడిగా ఆయన తనకు ఇచ్చిన గౌరవం, స్పేస్‌ మర్చిపోలేననీ , సెట్లో రీ టేకులు తీసుకొన్నా ఓపిగ్గా ఉండేవారనీ , తనను తప్పులు చేయించి, అందులోంచి పాఠాలు నేర్చుకునేలా చేశారనీ , ఆ సమయంలో నిజంగానే ఆయన ఓ ‘ఆచార్య’లా కనిపించారనీ , ఇక పూజా హెగ్డే , లంగా ఓణీ లో అచ్చమైన తెలుగు అమ్మాయిగా చాలా అందంగా కనపడతారనీ , ఆమె సోషల్ మీడియా క్వీన్ అనీ , ఈ మూవీ లో మా ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందనీ చెప్పారు. పూజా హెగ్డే మాట్లాడుతూ. .. కొరటాల స్టోరీ చెప్పగానే తన పాత్ర చిన్నదా ,పెద్దదా అని చూడకుండా ఓకే చేశాననీ , తన పాత్ర అంతగా నచ్చిందని , ” రంగస్థలం “మూవీ లో జిగేలు రాణి సాంగ్ కు”ఆచార్య “లో నీలాంబరి సాంగ్ కు చాలా డిఫరెన్స్ ఉందనీ , ఈమూవీ లో చిరుత షాట్ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుందనీ , “ఆచార్య “కథను కమర్షియల్ ఎలిమెంట్స్ తో కొరటాల అద్భుతంగా తెరకెక్కించారనీ , DOP తీరు మూవీ లవర్ అనీ , టెంపుల్ టౌన్ సెట్ ను అద్భుతంగా చిత్రీకరించారని , మణిశర్మ కంపోజ్ చేసిన అన్ని సాంగ్స్ సూపర్ అనీ రామ్ చరణ్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − eleven =