కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

విజయ్ దేవరకొండ తో "జనగణమన "- ఛార్మి

Puri Jagannadh Jana Gana Mana Movie With Liger Hero Vijay Deverakonda,Puri Jagannadh Confirms Jana Gana Mana,Puri Jagannadh Jana Gana Mana,Puri Jagannadh Jana Gana Mana Movie,Puri Jagannadh Jana Gana Mana Hero,Puri Jagannadh Jana Gana Mana Movie Upda

విజయ్ దేవరకొండ తో "జనగణమన "- ఛార్మి

Puri Jagannadh Jana Gana Mana Movie With Liger Hero Vijay Deverakonda

Puri Jagannadh Jana Gana Mana Movie With Liger Hero Vijay Deverakonda,Puri Jagannadh Confirms Jana Gana Mana,Puri Jagannadh Jana Gana Mana,Puri Jagannadh Jana Gana Mana Movie,Puri Jagannadh Jana Gana Mana Hero,Puri Jagannadh Jana Gana Mana Movie Upda

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ , అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్‌ క్యాప్షన్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ 2022 ఆగష్టు 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు.

“లైగర్ “మూవీ కై మిక్డ్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో విజయ్‌ దేవరకొండ శిక్షణ తీసుకున్నారు. “లైగర్”మూవీ తెలుగు , హిందీ భాషలతో పాటు తమిళ , మలయాళ , కన్నడ భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ ను ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి . తాజాగా "లైగర్ "మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పూరి కనెక్ట్స్ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మి కౌర్ ట్విట్టర్ లో పూరీ జగన్ వాయిస్ నోట్ ను షేర్ చేశారు. ఆ వాయిస్ నోట్ లో మేము ఈరోజుతో లైగర్ షూటింగ్ ను ముగించామనీ , ఈ రోజు నుండి జనగణమన`` అని జగన్ అన్నారు. అంతేకాదు హ్యాష్ దేవరకొండ అంటూ ఈ ప్రకటనలో క్లారిటీగా వెల్లడించారు.ఛార్మి ట్వీట్ లో#LIGER #JGM @TheDeverakonda #purijagannadh అని ఉంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్