
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ హీరోగా 'శ్రీరాజ్ బళ్లా' 'నరసింహపురం' అనే సినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఈసినిమా బృందంపై ప్రకాష్ రాజ్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాకు ఘన విజయం సాధించేందుకు అవసరమైన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయని.. కరోన ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి "నరసింహపురం" చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేస్తున్న హీరో-దర్శకనిర్మాతలను ఎంతైనా అభినందించేయాల్సిందేనని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. పరిశ్రమ పచ్చగా కలకళలాడాలంటే "నరసింహపురం" వంటి మీడియం బడ్జెట్ చిత్రాలు భారీ విజయాలు సాధించాల్సిన అవసరం చాలా ఉందన్నారు.