
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా ఎంత మంచి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2016 లో విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయనా కింగ్ నాగార్జున కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఈసినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు పేరుతో మరో సినిమాను తీసుకురావాలని ఎప్పటినుండో అనుకుంటున్నారు. కానీ ఇంతవరకూ ఈసినిమా సెట్స్ పైకి మాత్రం వెళ్లలేదు. అయితే ఈమధ్యే బంగార్రాజు సీక్వెల్ కు సంబంధించి పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్‌ను జులైలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది.