మార్నింగ్ మూడ్.. కాజల్ హ‌నీమూన్ ఆల్భ‌మ్

Actress Kajal Aggarwal Shares Another Picture From Her Maldives Tour On Social Media

కాజల్ అగర్వాల్ పెళ్లి అక్టోబర్ 30న జరిగిన సంగతి తెలిసిందే. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్‌ కిచ్లూతో వివాహం జరిగింది. ముంబయిలోని ఓ హోటల్‌లో ఇరు కుటుంబసభ్యులు అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇక విహహం తర్వాత కాజల్ తన ఫొటోలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇన్ని రోజులు పెళ్లి పనులతో బిజీగా ఉన్న కాజల్.. ఇప్పుడు ప్రస్తుతం హనీమూన్ కోసం మాల్దీవ్స్ వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తుంది. అక్కడికి వెళ్లిన దగ్గర నుండి రోజుకో ఫొటో అయినా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది ఈ భామ. ఇక ఇప్పుడు మరో ఫొటోను పోస్ట్ చేసింది. తాజాగా కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న హ‌నీమూన్ ఆల్భ‌మ్‌లో భాగంగా బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న ఫొటోని షేర్ చేసింది. పూల్‌లో కూర్చొని ఫుడ్‌ని ఆస్వాదిస్తుంది. ఇప్పుడు ఈ ఫొటో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

ఇక కాజ‌ల్ సినిమాల విష‌యానికి వస్తే ప్ర‌స్తుతం ఆచార్య సినిమాతో పాటు భార‌తీయుడు 2, మోసగాళ్లు ముంబై సాగా అనే సినిమాలు కూడా చేస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. ప్రస్తుతం కాజల్ హానీ మూన్ లో ఉంది కాబట్టి అక్కడినుండి వచ్చిన తర్వాత డిసెంబర్ నుండి షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 20 =