హిమజ ప్ర‌ధాన పాత్ర‌లో ‘జ’

Himaja Plays The Lead Role In Ja Movie

హిమజ… బుల్లి తెర.. వెండితెర ప్రేక్షకులకు ఈమె సుపరిచితురాలే. ప‌లు సీరియ‌ల్స్ , సినిమాల‌లో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేసిన హిమ‌జ తన అందంతోనే కాదు అభినయంతోనూ అభిమానులను ఆకట్టుకుంది. ఇక గత ఏడాది బిగ్ బాస్ సీజ‌న్ 3లో ఒక కంటెస్టెంట్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ షో తర్వాత హిమజకు ఇంకాస్త ఎక్కువ గుర్తింపే వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు హిమజ ప్రధాన పాత్రలో ఒక సినిమా తెరకెక్కబోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమాకు `జ` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ లుక్ సినిమాపై ఆస‌క్తిని రేపుతుంది. మరి హిమ‌జ తొలి సారి లీడ్ రోల్‌లో న‌టిస్తుంది ఈ సినిమాతో కెరీర్ ఏమన్నా మలుపు తిరుగుతుందేమో చూద్దాం. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్లడించ‌నున్నారు.

కాగా హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సైదిరెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. `జైదుర్గా ఆర్ట్స్` బ్యానర్‌పై గోవ‌ర్ధన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. వెంగీ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. ఆనంద్ పవన్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు.

[custom_ad]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 2 =