మీకు తెలుసా.. మొదటి మహిళా డైరెక్టర్-ఫస్ట్ డ్యూయల్ రోల్ చేసిన హీరోయిన్ భానుమతి రామకృష్ణ
Did you know this interesting fact about yesteryear actress bhamumathi ramakrishna?
తెలుగు సినీ చరిత్రలో ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు. సినీ పరిశ్రమ పుట్టినదగ్గరనుండి ఇప్పటికీ కనీసం కొన్ని వందలలో హీరోయిన్స్ వెండి తెరను ఏలి వుంటారు. కానీ కొంతమంది మాత్రం తమ ముద్రని అలా వేసి ఉంచుతారు. అందరికంటే భిన్నంగా వుంటారు. అందుకే వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అలాంటి హీరోయినే అలనాటి తార భానుమతి రామకృష్ణ.
భానుమతి రామకృష్ణ బహుముఖ ప్రజ్ఞాశాలి. నటి, దర్శకురాలు, గాయకురాలు, నిర్మాత, స్టూడియో నిర్వాహకురాలు, చిత్రకారిణి, జోతిష్యం చూడటం కూడా తెలుసు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కళలు ఆమె సొంతం. అందుకే బహుముఖ ప్రజ్ఞాశాలి అనే బిరుదు ఆమెకే సొంతం. ఆమెను చూస్తే ఆమె ముఖంలో ధైర్యం తాండవిస్తున్నట్టు కనిపిస్తుంటుంది. మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఏమాత్రం తక్కువ కాదు అని అన్ని విషయాల్లోనూ ఎప్పుడూ ముందుండేది. అప్పట్లో హీరోలే ఆమెతో మాట్లాడటానికి భయపడే వారంటేనే అర్ధం చేసుకోవచ్చు భానుమతి గారు ఎలా ఉంటారో.

నిజానికి భానుమతి గారు ఎప్పుడూ నటి అవ్వాలని కోరుకోలేదట. తన తల్లి గారికి సంగీతం రావడంతో తాను కూడా గాయకురాలిగా స్థిరపడాలనే కోరిక బలంగా ఉండేదట. అయితే, ఆమెను సినిమాలు వదల్లేదు. సినిమా పరిశ్రమలో ఆమె సాధించాల్సిన ఎన్నో రికార్డ్స్ ఉండటంతో విధి కూడా అదే బలంగా కోరుకుంది. నటిగా వెండి తెరపై వెలుగులు చిమ్మింది. తన సినీ ప్రయాణంలో ఎన్నో రికార్డ్స్ ను సొంతం చేసుకుంది. డైరెక్షన్ అంటే కేవలం మగవారే కాదు ఆడవాళ్లు కూడా చేయొచ్చు అని చూపించిన హీరోయిన్ భానుమతి. అందుకే ఇండియా లో మొదటి మహిళా డైరెక్టర్ గా రికార్డ్స్ లోకి ఎక్కారు. అంతేకాదు మొదట ద్విపాత్రిభినయం చేసిన హీరోయిన్ కూడా భానుమతే. 1952 లో తెలుగు, తమిళం, హందీలలో తీసిన చండీరాణి సినిమానకు దర్శకత్వం వహించడమే కాదు... ద్విపాత్రిభినయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి తెలుగు సినిమా అంటే మగవారి ఆధిక్యత వుంటుంది అని చెప్పుకునే ఆ రోజుల్లోనే తన సత్తాచాటిన భానుమతి గారు చరిత్ర లో ఎప్పటికి నిలిచిపోతారు.
వీడియోస్
00:25:50Antasthulu Movie Full Songs w/Video - Juke Box - ANR, Ghantasala, Bhanumathi
00:03:05Ninu Veedani Needanu Nene Song - Antasthulu Movie Songs - ANR, Ghantasala, Bhanumathi
00:04:36Nuvvante Naakenduko Song - Antastulu Movie Songs - ANR, Krishna Kumari, Bhanumathi
00:06:30


