అర్జున్ ‘జెంటిల్‌మేన్ 2’ ప్రకటించిన నిర్మాత కేటి కుంజుమోన్

Producer KT Kunjumon Announces Sequel To Shankar Super Hit Movie Gentlemen

ఈమధ్య కాలంలో సీక్వెల్స్ చేయడం కామన్ అయిపోయింది. సినిమా హిట్ అయితే చాలు వాటి సీక్వెల్స్ ను తీసేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రెంట్ నడుస్తుండటంతో ఒకప్పుడు హిట్ అయిన సినిమాలకు కూడా సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒకప్పటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ ను ప్రకటించారు. ఆ సినిమా ఏదో కాదు జెంటిల్‌మేన్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శంకర్ దర్శకత్వంలో అర్జున్‌, మధుబాల హీరో హీరోయిన్లుగా వచ్చిన జెంటిల్‌మేన్‌ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఓ సంచలనం సృష్టించింది. అర్జున్ కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది. కృష్ణమూర్తి పాత్రలో తన సత్తా చాటాడు. ఇక శంకర్ కూడా తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించి ప్రశంసలు అందుకున్నాడు. కె.జి. కుంజమోన్‌ నిర్మించిన ఈ చిత్రం 1993లో విడుదలలైంది. ఇక ఇప్పుడు జెంటిల్‌మేన్‌కు పార్ట్ 2గా, మొదటి భాగానికి రెండింతలు ఉండేలా జెంటిల్‌మేన్ 2 చిత్రాన్ని నిర్మిస్తున్న‌ట్లు తెలిపారు నిర్మాత కేటి కుంజుమోన్.

ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”జెంటిల్‌మేన్ మూవీ తమిళ‌, తెలుగు భాష‌ల‌లో విడుద‌లై భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. అయితే మ‌రోసారి అంద‌రి అంచ‌నాల‌ను అందుకునేలా రెండింత‌లు గొప్ప‌ద‌నంతో జెంటిల్‌మేన్ 2 తెర‌కెక్కిస్తున్నాం. అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో హాలీవుడ్ చిత్రాల‌కు ధీటుగా లేటెస్ట్ ప్రొడక్షన్ టెక్నిక్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం” అన్నారు. ఈ చిత్రాన్ని త‌మిళ‌, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాష‌ల‌లో జెంటిల్‌మేన్ ఫిలిం ఇంట‌ర్‌నేష‌న‌ల్ సంస్థ‌ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తుంది. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్రకటించనున్నట్టు తెలిపారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =