శరీరంతో నాకు సంబంధం లేదు

Actor Naga Shaurya Attributes His Body Transformation To His Gym Trainer

లాక్ డౌన్ మాత్రం కొంతమంది యంగ్ హీరోలకు బాగా ఉపయోగపడిందని చెప్పొచ్చు. ఇంట్లోనే ఉంటూ బాడీ షేపింగ్ పై దృష్టి సారించి సిక్స్ ప్యాక్స్ చేసేసారు. ఇందులో నాగశౌర్య కూడా వున్నాడు. అప్పుడప్పుడు ఆ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూనే వున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తో కలిసి నాగ శౌర్య 20 వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పురాతన క్రీడ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రీ లుక్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇంతకుముందు ఏ సినిమాలో కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించనున్నట్టు తెలుస్తుంది నాగశౌర్య మేకోవర్ చూస్తుంటే.

ఇక తాజాగా నాగశౌర్య జిమ్ లో తీసుకున్న ఒక ఫొటో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. చొక్కా విప్పేసి బాడీని ఎక్స్ పోజ్ చేస్తూ ట్రైన‌ర్ తో ఉన్న ఫొటో ట్విట‌ర్ లో పోస్ట్ చేసాడు. అంతేకాదు ఫొటోకు శరీరం విష‌యానికొస్తే అదిట్రైన‌ర్ కు సంబంధించిన అంశం అంటూ ట్వీట్ పెట్టాడు.

 

దీనితో పాటు పలు ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతుంది. . నాగశౌర్య హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో కె.పి.రాజేంద్ర దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతుంది. అవసరాల శ్రీనివాస్ తో కూడా ఒక సినిమా లైన్లో పెట్టాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + six =