అభిమానులతో సమంత చిట్ చాట్

Actress Samantha Akkineni Makes A Fun Live Chat With Social Media Audience On Instagram

తెలుగు, తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ సమంత తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయిన సమంత గార్డెనింగ్ పై ఆసక్తితో పంటలు పండిస్తున్నారు. “ది ఫ్యామిలీ మెన్ 2 “వెబ్ సిరీస్ లో నటించిన సమంత ప్రస్తుతం ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ సమంత నిన్న (సెప్టెంబర్ 2)అభిమానులతో ముచ్చటించారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబిచ్చారు. సమంత మాట్లాడుతూ .. రొమాంటిక్ , కామెడీ , యాక్షన్ , సోషల్ వంటి ఏ జానర్ మూవీ లో నైనా నటించడానికి సిద్ధమే ననీ , లాక్ డౌన్ లో ఒక స్పెషల్ ప్రాజెక్ట్ చేశాననీ , త్వరలోనే మీకు చూపిస్తానని , కుటుంబంతో ఎక్కువ సమయం స్పెండ్ చేశాననీ , కరోనా వచ్చిన తరువాత సంతోషంగా ఉండడం కోసం కష్ట పడితే చాలని అనిపిస్తుందనీ , తాను శాకాహారి ననీ , అన్నంతో పాటు అన్ని రకాల కూరగాయలు తింటాననీ , ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మనం తినే ఆహారాన్ని మనమే పండించు కొంటే ఆరోగ్యం గా ఉండవచ్చనీ , కరోనా సాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రజలు మెంటల్లీ స్ట్రాంగ్ గా మారుతారని విశ్వసిస్తున్నాననీ , మంచి ఆహరం , సింపుల్ జీవితం , యోగా , మెడిటేషన్ జీవితాన్ని మెరుగ్గా ఉంచుతాయనీ , తాను నటించిన వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మెన్ 2 ” రషెస్ చూసినప్పుడు ఆనందంతో కన్నీళ్ళు వచ్చాయనీ , చివరగా అభిమానుల గురించి తాను మీలో ఒక భాగం, మీరు తనలో ఒక భాగం అంటూ సమంత చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =