మా మధ్య జరిగేది నాకు, పవన్ కే తెలుసు..!

Me and Pawan Kalyan Know Each Other Very Well Says Tollywood Ace Comedian Ali

పవన్-అలీ మధ్య ఉన్న రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే. పవన్ అన్ని సినిమాల్లో అలీ ఉండాల్సిందే. అలీ ఉంటే తనకు అదో ధైర్యమని ఎన్నో సార్లు వారి మధ్య ఉన్న సంభంధం గురించి పవన్ చెప్పారు. ఇక అలీ కూడా పవన్ తో అంతే సరదాగా ఉంటారు. అయితే గత ఎన్నికల్లో కాస్త ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీలో కాకుండా.. అలీ వైసీపీ పార్టీ లో చేరడంతో నొచ్చుకున్న పవన్ అలీ పై పలు వ్యాఖ్యలు చేశారు. ఇక అలీ కూడా పవన్ వ్యాఖ్యలపై స్పందించి రివర్స్ కౌంటర్ ఇచ్చారు. దీనితో వారిద్దరి మధ్య కాస్త దూరం పెరిగిందనుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉంటున్న అలీ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. ఆయన సినిమాలలో మొదటి నుంచి ఉన్నప్పటికీ ‘తొలిప్రేమ’ చిత్రం నుంచి మా మధ్య అనుబంధం బాగా బలపడిందని చెప్పుకొచ్చారు. ‘‘పవన్ కల్యాణ్‌గారికి నేనంటే చాలా ఇష్టం. నా కామెడీ అన్నా, హావభావాలు అన్నా ఆయన బాగా ఇష్టపడతారు. మేము ఏదైనా స్టేజ్ మీద ఉన్నప్పుడు సీక్రెట్‌గా సైగలు చేసుకుంటూ ఉంటాం. ఆ సైగలు ఎవ్వరికీ తెలియవు. దాదాపు ఆయన నటించిన అన్ని చిత్రాలలో నేను నటించాను. అంతేకాదు ప‌వ‌న్ త‌న‌కు ప్ర‌తి ఏడాది మామిడి పండ్లు పంపేవార‌ని పేర్కొన్నారు. కానీ ఈసారి మాత్రం త‌న‌కు మామిడి పండ్లు అంద‌లేద‌ని కాస్త నిరాశ‌కు లోన‌య్యారు. పంపుతారు. కానీ ఈ సంవత్సరం ఆయన రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల పంపలేదు. వచ్చే సంవత్సరం పంపుతారని అనుకుంటున్నాను..’’ అని అలీ చప్పుకొచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − fifteen =