సినిమా వార్తలు
ట్యాగ్ · 61 కథనాలు · పేజీ 4
సినిమా వార్తలు
విశ్వక్ సేన్ 'ఓ మై కడవులే' రీమేక్ ప్రారంభం
మలయాళ సినిమా అంగమలై డైరీస్‌ను తెలుగులో ‘ఫలక్‌నుమా దాస్’గా తెరకెక్కించిన విశ్వక్ సేన్.. హీరోగా, దర్శకుడిగా మంచి విజయం సాధించాడు. ఇక గత ఏడాది శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సినిమా చేసి దానితో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. విశ్వక్ సేన్ ప్రస్తుతం లక్కీ మీడియా బ్యానర్ పై నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వంలో 'పాగల్' సినిమా చేస్తున్నాడు. ఇక విశ్వక్ సేన్ తమిళ్ హిట్ మూవీ 'ఓ మై కడవులే' తెలుగు రీమేక్ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. పీవీపీ సినిమాస్ 'ఓ మై కడవులే' హక్కులను సొంతం చేసుకుంది.