సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు
సినిమా వార్తలు
`దిల్` రాజు సంస్థలో విజయ్ దేవరకొండ?
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే... ఈ సినిమాని ప్రముఖ నిర్మాత `దిల్` రాజు నిర్మిస్తారని తెలిసింది. విజయ్ దేవరకొండతో ఓ చిత్రాన్ని నిర్మించాలని `దిల్` రాజు చాన్నాళ్ళుగా భావిస్తున్నారట. శివ నిర్వాణ కాంబినేషన్ మూవీతో అది కార్యరూపం దాల్చనుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందంటున్నారు.