
ట్యాగ్ · 1 కథనాలు


సినిమా వార్తలు
" ది కశ్మీర్ ఫైల్స్" నిర్మాతకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషెస్
జీ స్టూడియోస్ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో మిథున్ చక్రవర్తి , అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ప్రధాన పాత్రలలో 1990లలో జమ్మూకశ్మీర్లో తీవ్రమైన తిరుగుబాటు, అల్లరి మూకలు, కశ్మీర్ హిందువులపై దాడి ఘటనల నేపథ్యంలో తెరకెక్కిన "ది కశ్మీర్ ఫైల్స్" హిందీ మూవీ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. సుమారు 350 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. " ది కశ్మీర్ ఫైల్స్" మూవీప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు , రాజకీయ నాయకుల ప్రశంసలు అందుకుంటుంది.