
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


దర్శకులు తాతినేని ప్రకాశరావు , కె . ప్రత్యగాత్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన తాతినేని రామారావు "నవరాత్రి"(1966) మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. "జీవన తరంగాలు", "యమగోల " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన తాతినేని "యమగోల "హిందీ రీమేక్ గా తెరకెక్కిన "లోక్ పరలోక్ "మూవీ తో బాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. తెలుగు , హిందీ భాషలలో సుమారు 70 సినిమాలకు దర్శకత్వం వహించి పలు సూపర్ హిట్ మూవీస్ తో తెలుగు , హిందీ ప్రేక్షకులను అలరించారు.