ట్యాగ్ · 42 కథనాలు · పేజీ 3
బ్రదర్ నిన్ను చాలా మిస్ అవుతున్నా..!
ఈ కరోనా వైరస్ ఏమో కానీ ఒక్కసారిగా ప్రపంచం మొత్తం ఇంటికే పరిమితమైంది. ఈ వైరస్ సంగతి పక్కన పెడితే.. ఇంటికి కుటుంబానికి కాస్త టైమ్ కూడా కేటాయించలేని.. బిజీ బిజీ జీవితం గడుపుతున్న వాళ్లకు మాత్రం నిజంగా ఇది గుడ్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే...ఈ రకంగా అయినా కాస్త కుటుంబంతో కలిసి గడిపే అవకాశం దక్కింది. ఇక నాణానికి ఇది ఒక కోణం అయితే మరో కోణం కొంత మంది ఇంటికి వెళ్లలేని పరిస్థితి. ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాల్సిన పరిస్థితి. దీనితో చాలా మంది కుటుంబాలకు దూరంగా ఉంటూ బాధపడే వాళ్ళు కూడా వున్నారు. ఈ నేపథ్యంలో ఒక స్టార్ హీరోయిన్ కూడా ఈ లాక్ డౌన్ వల్ల తన బ్రదర్ ను బాగా మిస్ అవుతుందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు తమన్నా.
మెగా ఫ్యామిలీ తండ్రీకొడుకుల కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న కథానాయికలు
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా... తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ ఇద్దరు కథానాయికలది ప్రత్యేకమైన స్థానం. ఎందుకంటే... తెలుగునాట దాదాపు అందరు యంగ్ హీరోస్‌తోనూ ఆడిపాడి అలరించిన వైనం వీరి సొంతం. అంతేకాదు... ఒకే ఫ్యామిలీకి చెందిన తండ్రీకొడుకుల విషయంలో అటు తనయుడితోనూ, ఇటు తండ్రితోనూ రొమాన్స్ చేసి విజయాలను అందుకున్న నాయికలుగా కూడా ఓ అరుదైన ఘనతను తమ సొంతం చేసుకున్నారు ఈ టాలెంటెడ్ హీరోయిన్స్.