ట్యాగ్ · 2 కథనాలు
తమన్నా నో మేకప్ లుక్
మాస్క్ బ్యూటీ తమన్నా
తెలుగు , తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ తో 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో తమన్నా ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. కరోనా బారిన పడి కోలుకున్న తమన్నా తిరిగి షూటింగ్స్ కు సిద్ధం అయ్యారు. తమన్నా ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ ", "గుర్తుందా శీతాకాలం ", బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్ " తెలుగు రీమేక్, "నవంబర్ స్టోరీ "తమిళ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.
తమన్నా నో మేకప్ లుక్
కరోనా లాక్ డౌన్ నుండీ ఇళ్ళకే పరిమితం అయిన సినీ సిలబ్రిటీస్ లాక్ డౌన్ సమయం ముగిసినా షూటింగ్స్ ప్రారంభం కాకపోవడంతో ఇళ్ళ వద్దనే ఉంటున్నారు. లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తూ స్టార్ హీరోయిన్స్ సమంత , రకుల్ ప్రీత్ , రష్మిక సోషల్ మీడియా ద్వారా ఫొటోస్ , వీడియోస్ తో తమ జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అదే విధంగా స్టార్ హీరోయిన్ తమన్నా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.