
ట్యాగ్ · 3 కథనాలు

#SURYA 42 మూవీ లో 200 మంది బాడీ బిల్డర్స్ తో సూర్య యాక్షన్ సీన్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ హీరో సూర్య తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హీరో సూర్య ఫస్ట్ టైమ్ పీరియాడికల్ మూవీ #సూర్య 42 తో ప్రేక్షకులను అలరించనున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్స్ పై శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా సూర్య 42 తమిళ మూవీ భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ కథానాయిక.దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఫ్యాన్స్ కు సూర్య మెసేజ్
తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు సూర్య. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ, తమిళ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం అయితే సూర్య పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా ప్రస్తుతం రూపొందుతుంది. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈసినిమా కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక దీనితో పాటు పలు సినిమాలు కూడా సూర్య లిస్ట్ లో ఉన్నాయి.

మరో బయోపిక్ లో సూర్య
కోలీవుడ్ స్టార్ సూర్య ఖాతాలో మరో బయోపిక్ చేరనుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న `సూరరై పోట్రు` (తెలుగులో `ఆకాశం నీ హద్దురా`) డెక్కన్ ఎయిర్ వేస్ అధినేత గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ కాగా... తాజాగా సూర్య మరో బయోపిక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే, అది ఎవరి బయోపిక్ నో అన్న విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.