
ట్యాగ్ · 2 కథనాలు


#SSMB.. న్యూ చాప్టర్ అంటున్న మహేష్

అభిమానులు , ప్రేక్షకులకు మహేష్ బాబు హోలీ శుభాకాంక్షలు
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫస్ట్ సింగిల్ కళావతి కి ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. దుబాయ్ , హైదరాబాద్ , గోవా , స్పెయిన్ లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ”సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.

#SSMB.. న్యూ చాప్టర్ అంటున్న మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి సినిమా వచ్చి కూడా చాలా రోజులైపోయింది. సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత మరో సినిమా రాలేదు. ఇక అయితే ప్రస్తుతం మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా చేస్తున్నాడు. కరోనా లేకపోతే ఈసినిమా ఎప్పుడో రిలీజ్ అయి ఉండేది. ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేసి మిగిలినా పోర్షన్ ను కూడా కంప్లీట్ చేయనున్నారు. క కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.