
ట్యాగ్ · 2 కథనాలు


సుకుమార్ రైటింగ్స్ లో సిద్దూ
ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించి ఆ తరువాత గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో సిద్దు జొన్నలగొడ్డ. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక గత ఏడాది వచ్చిన డీజే టిల్లు తో సిద్దు క్రేజ్ కూడా బాగానే పెరిగింది. సిద్దుతో సినిమాలు చేయడానికి చాలామంది మేకర్స్ ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం అయితే సిద్దూ డీజే టిల్లు సీక్వెల్ చేస్తున్నాడు. టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. అనుపమా పరమేశ్వరనే హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను ఈసినిమాను కూడా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు.
సిద్ధు, శ్రద్ధ శ్రీనాధ్ కాంబినేషన్ 'నరుడి బ్రతుకు నటన'
సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాధ్ కాంబినేషన్ లో కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. లాక్ డౌన్ లోనే ఈ సినిమా కూడా ఓటీటీ లో రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాబినేషన్ లో కొత్త సినిమా రానుంది. 'కృష్ణ అండ్ హిజ్ లీల' డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన విమల్ కృష్ణ ను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నాడు.