ట్యాగ్ · 2 కథనాలు

ఆకట్టుకుంటున్న శర్వా డాన్ లుక్
శర్వానంద్ తో అజయ్ భూపతి `మహాసముద్రం`?
గత ఏడాది సంచలనం `ఆర్ ఎక్స్ 100`తో దర్శకుడిగా తొలి అడుగు వేశాడు అజయ్ భూపతి. ఆ సినిమా విడుదలై ఏడాది దాటినా రెండో చిత్రం పట్టాలెక్కలేదు. వాస్తవానికి, `మహాసముద్రం` పేరుతో ఓ మల్టీస్టారర్ ని చేయాలని అజయ్ భావించాడు. అయితే, పలు కారణాల వల్ల ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ యాక్షన్ ఫిల్మ్ సెట్స్ పైకి వెళ్ళబోతోందని సమాచారం.

ఆకట్టుకుంటున్న శర్వా డాన్ లుక్
సుధీర్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న సినిమాలో శర్వానంద్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో శర్వానంద్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం గత కొద్ది రోజులుగా స్పెయిన్ లో ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమాలో శర్వా ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఈరోజు శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా డాన్ లుక్ లో ఉన్న శర్వా ప్రీ లుక్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక ప్రీ లుక్ అయితే అందరినీ ఆకట్టుకుంటుంది.