
ట్యాగ్ · 42 కథనాలు · పేజీ 3

'మేజర్' గ్లింప్స్ - టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరోస్ కు సరైన జోడీ
యాక్టర్ ,డైరెక్టర్ మహేష్ మంజ్రేకర్ తనయ సాయీ మంజ్రేకర్ , స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా రూపొందిన "దబంగ్ 3" మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో సాయీ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సాయీ 2 తెలుగు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా , మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన "మేజర్ " మూవీ జూలై 2 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తో సాయీ కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
'మేజర్' గ్లింప్స్ - టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
గూఢచారి, ఎవరు లాంటి థ్రిల్లర్ సినిమాలతో అలరించిన అడివి శేష్ ఇప్పుడు మేజర్ సినిమాతో వచ్చేస్తున్నాడు. అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. జులై 2, 2021న మేజర్ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అది అందర్నీ ఆకట్టుకుంది.